విజయభేరి సభ విజయవంతం.కాంగ్రెస్ నేతల్లో నూతన ఉత్సవం.
తాండూరుసెప్టెంబర్18(జనంసాక్షి) తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభ విజయవంతమైందని తాండూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అభిబ్ లాల పేర్కొన్నారు. ఆదివారం తాండూర్ నుండి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభ విజయవంతంఅయిందని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబిబ్ లాల మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయబేరీ సభలో ఆరు పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పెరిగిందని తెలిపారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు. కలిసికట్టుగా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాంది పలికి విజయమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్లో ముగ్గురికి నోబెల్
- బీహార్లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- బీహార్లో నూతన తేజస్వం..
- దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
- దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
- మరిన్ని వార్తలు