తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

* టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే హరిప్రియ
* పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

టేకులపల్లి,సెప్టెంబర్ 20 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా నిధులను విడుదల చేస్తున్నారని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. బుధవారం ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ విస్తృతంగా పర్యటించారు. మండలంలోని గ్రామపంచాయతీలలో డి ఎం ఎఫ్ టి నిధులతో అభివృద్ధి పనులకు మంజూరు కాబడిన రహదారులకు శంకుస్థాపన, పనులు పూర్తయిన వాటికి ప్రారంభోత్సవం చేశారు. మండల పరిధిలోని శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 9వ మైలు తండా గ్రామపంచాయతీలోని ఆర్ & బి రోడ్డు నుండి కోటల్ల గ్రామం వరకు డి ఎం ఎఫ్ టి నిధుల నుంచి 3 కోట్ల అంచనా వ్యయంతో బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 9వ మైల్ తండా లో 25 లక్షల వ్యయంతో ఒక వీధికి సిమెంట్ రోడ్డు, అదే గ్రామంలో మరొక వీధికి సీసీ రోడ్ కోసం 30 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సిసి రోడ్డులను ప్రారంభించారు. గ్రామపంచాయతీలోని మరొక వీధికి 15 లక్షల అంచనా వ్యయంతో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మద్రాస్ తండా గ్రామపంచాయతీలోని డి ఎం ఎఫ్ టి నిధుల నుంచి 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో రావులపాలెం నుంచి మద్రాస్ తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయతీలోని 10 లక్షల అంచనా వ్యయంతో మరొక అంతర్గత రహదారికి 20 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సిసి రోడ్డును ప్రారంభించారు. కొత్త తండా గ్రా