అంగన్ వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన బీసీ మహిళ సంఘం.
తాండూరు సెప్టెంబర్ 21(జనంసాక్షి)అంగన్ వాడీలతో చెలగాటం ఆడోద్దని, టీచర్లను, హెల్పర్లను ఆదుకోవాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తాండూరు మండల పరిషత్ కార్యాయలంలో దాదాపు పదిరోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడి టీచర్లకు, హెల్పర్లకు సంఘం ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, మహిళ అధ్యక్షురాలు జ్యోతి, ఉపాధ్యక్షురాలు అనిత, కార్యదర్శి విజయలక్ష్మీలు సమ్మెలో అంగన్ వాడీల తరుపున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్ వాడీ టీచర్లను, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కనీస వేతనాలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, అంగన్ వాడీ యూనియన్ నాయకులు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.