24నుంచి ఇంటర్నేషనల్‌ చెస్‌ పోటీలు

వరంగల్‌, జనవరి 19 (): వరంగల్‌ ఇంటర్నేషనల్‌ స్థాయి చెస్‌ పోటీలు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు హన్మకొండలో విష్ణుప్రియ గార్డెన్‌లో జరగనున్నట్లు భూపాలపల్లి చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడుల ఈ. కనకయ్య తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు చెస్‌ పోటీల కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కనకయ్య మాట్లాడుతూ ఏపీచెస్‌, వరంగల్‌ చెస్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరవుతారని, గెలుపొందిన వారికి నగదు పారితోషికంతో పాటు జ్ఞాపికలు అందజేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో ఇంటర్నేషనల్‌ స్థాయి పోటీలు జరగడం వరంగల్‌కే గర్వకారణమని, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వివరాలకు పోటీల నిర్వహణ కార్యదర్శి సంపత్‌ ను సంప్రదించాలని అన్నారు.

తాజావార్తలు