24 గంటల్లో దొంగను పట్టించిన 3,000 రూపాయల కెమెరా-గాంధారి

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 11
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఒక దొంగతనము నమోదయింది, ఈ దొంగతనంలో ఫిర్యాదుదారు తన ఇంటికి తాళం వేసి, ఇంట్లోని కెమెరాలను ఆన్ చేసి పనిమీద కూకట్పల్లి కి వెళ్లడం జరిగింది, అతను ఇంటి బయట కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది, మరియు హాల్లో కూడా ఆన్లైన్ అమెజాన్ లో కొన్న Rs.3000/- పెట్టి కొన్న చిన్న కెమెరా ను కూడా వైఫైకి అనుసంధానం చేసి తన ఫోన్ కి కనెక్షన్ ఇవ్వడం జరిగింది, నేరస్థుడు ఒకరోజు రాత్రి అతని  ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. బయట ఉన్న కెమెరాలను మరియు డివిఆర్ ని, హాల్లో ఉన్న చిన్న కెమెరాను కూడా దొంగ తనతో పాటు తీసుకొని వెళ్లడం జరిగింది, ఫిర్యాదుదారుడు కూకట్పల్లి లో ఉన్నప్పుడు అతనికి ఫోన్లో చిన్న కెమెరా యొక్క ఫుటేజ్ కట్ కావడం జరిగింది, ఎందుకు  ఫోన్ లో ఫుటేజీ రావడం లేదు, ఎందుకు బ్లాక్ అయింది అని అనుమానించి వాళ్ళ బ్రదర్ ని ఇంటికి వెళ్లి చూడమని చెప్పగా, అతను వెళ్లి చూడగా, డోర్ లాక్ బ్రేక్ అయ్యి కనబడింది ,ఇంట్లో వస్తువులన్నీ బీరువా ఓపెన్ చేసి చిందరవందర గా  ఉన్నాయి, తరువాత ఫిర్యాదుదారు తన ఫోన్ ఓపెన్ చేసి రికార్డింగ్ చూడగా ఒక దొంగ తన ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసుకొని పోవడం ఆ ఫుటేజ్ లో రికార్డయి ఉంది,ఇట్టి సంఘటన తన ఫోన్లో నిక్షిప్తం అయ్యి ఉన్నది, ఇట్టి  ఫుటేజ్ సహాయంతో దర్యాప్తు బృందము నేరస్తున్ని  24 గంటల్లో పట్టుకోవడం జరిగింది, కనుక ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో 3000 రూపాయలు వెచ్చించి ఒక చిన్న కెమెరాను పెట్టుకోగలరు, దానితో మీరు కష్టపడి సంపాదించుకున్న బంగారము, డబ్బు వెంటనే రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎవ్వరు కూడా  నిర్లక్ష్యం చేయరాదు, మరియు సెంట్రల్ లాకులు వేసుకోండి అని గాంధారి ఎస్సై సాయిరెడ్డి తెలిపారు