24 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి అంచనా
కొనుగోళ్లకు తొమ్మిది సీసీఐ కేంద్రాల ఏర్పాటు
త్వరలో వ్యాపారులతో మంత్రి సవిూక్ష
ఆదిలాబాద్,సెప్టెంబర్29(జనంసాక్షి): ఈ సీజన్‌లో 24 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ మార్కె ట్ యార్డుల్లో 9 సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 40 జిన్నింగ్ మిల్లులు ఉండగా.. అధికారులు త్వరలో పత్తి వ్యాపారులతో సమావేశం నిర్ణయించనున్నారు. మంత్రి జోగు రామన్నతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. మద్దతు ధర కంటే ఎక్కువగా పత్తి కొనుగోలు చేయాలని విషయంలో వ్యాపారులతో చర్చిస్తారు. గేతేడాది సైతం కేంద్ర ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ప్రైవేటు వ్యాపారులు ఎ క్కువ ధరకు పత్తిని కొనుగోలు చేశారు. ఆ సారి సైతం ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కొనుగళ్లకు సంబంధించి మార్కెట్ యార్డుల్లో కాంటాలు, తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లను సిద్ధం చేశారు. ఆదిలాబాద్‌లో 2, ఇంద్రవెల్లి, బేల, ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, పొ చ్చర, సొనాలలో కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ సారి కేంద్రం పత్తిని క్వింటాకు రూ.5450 ప్రభుత్వం నిర్ణయించగా.. గత ఏడాది కంటే రూ.1130 అధికంగా ఉంది. జిల్లా
వ్యాప్తంగా అక్టోబర్ రెండో వారంలో ఈ కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చే సేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. మరో పది రోజుల్లో పత్తి పంట చేతికి రా నుండగా.. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. వానాకాలం సీజన్‌లో పత్తి, సో యాబీన్, కంది పంటలను వేస్తారు. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 1,39,600 లక్షల హెక్టార్లలో రైతులు పత్తి పంటను వేశారు. సీజన్‌కు ముందుగానే మేలు రకమైన పత్తి విత్తనాలను కొనుగోలు చేశారు. సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు అనుకూలిస్తుండడంతో రైతులు సకాలంలో పంటలు వేశారు. నాణ్యమైన విత్తనాలతో పాటు క్రమంగా వర్షాలు కురువడంతో పత్తి పంట ఏపుగా పెరిగింది. పంటపై పింక్‌బౌల్ ప్రభావం కనపడగా అధికారులు సకాలంలో చర్యలు తీసుకోవడంతో దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి.