రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్త వర్ష సూచన
హైదరాబాద్ : రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కర్నాటక తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడం కోస్తాంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.