25 ఏళ్ల లో జరగనీ అభివృద్ధి ఈ రెండున్నర ఏళ్లలో జరిగింది – యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు

– కేసులు పెట్టి అభివృద్ధిని అడ్డుకోలేరు
-17వ వార్డులో అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ సెప్టెంబర్ 5 (జనం సాక్షి): హుజూర్ నగర్ నియోజకవర్గంలో 25 ఏళ్ల లో జరగనీ అభివృద్ధి ఈ రెండున్నర ఏళ్లలో జరిగిందని, ఎవరేన్ని కేసులు పెట్టిన అభివృద్ధిని అడ్డుకోలేరని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సోమవారం హుజూర్ నగర్ పట్టణం లోని 17 వార్డ్ (మటన్ మార్కెట్)నందు నెలకొల్పిన గణనాథునీ విగ్రహం వద్ద పూజ కార్యక్రమంలో నియోజక వర్గ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, సి సి రోడ్లు, డ్రైనేజీ లు, మినీ ట్యాంక్ బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బైపాస్ ఇలా అన్ని రకాల అభివృద్ధి పనులకు శ్రీకారంచుట్టి ,యుద్ధప్రాతిపదికన పనులు జరుపుతున్నామని అలాగే రానున్న 6 నెలల్లో పనులన్నీ పూర్తి చేస్తామని, ఎన్ని కేసులు వేసి అభివృద్ధిని ఆపాలి అనుకుంటే అది కొన్ని రోజులు మాత్రమే అపగలరనీ త్వరలోనే కోర్ట్ కేసులు కూడా ఛేదించుకొని ఆగిపోయిన మెయిన్ రోడ్ నిర్మాణం చేస్తామని తెలియజేసారు. హుజూర్ నగర్ పట్టణంలో 800 పెన్షన్స్ కొత్తగా మంజరి చేశామని, నియోజకవర్గం మొత్తం సుమారు 11000 నూతన పెన్షన్స్ మంజరి అయ్యాయని, కొన్ని కొన్ని కారణాల వలన రిజెక్ట్ అయిన పెన్షన్స్ ని కూడా తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేసారు.
ఈ కార్యక్రమములో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, అట్లూరి హరిబాబు, పట్టణ పార్టీ మహిళా అధ్యక్షురాలు దొంతి రెడ్డి పద్మ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.