25, 26న స్పోర్స్ట్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రవేశ ఎంపికలు
ఖమ్మం, జూలై 20 : స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ కర్నూలు ప్రవేశాలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్టు కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ రమేశ్ బాబు శుక్రవారం ఖమ్మంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు అక్కడికి వెళ్లి ఎంపికలో పాల్గొనవచ్చని సూచించారు. బాస్కెట్ బాల్, హ్యాండ్, ఫుట్‌బాల్, త్వైకాండో తదితర అంశాలలో ప్రతిభా నిరూపించుకునే క్రీడాకారులు ఈ నెల 25, 26 తేదీలలో కర్నూలు స్టేడియంలో జరిగే ఎంపికలో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 25న ఉదయం 8 గంటలకు కర్నూలులో రిపోర్టు చేయాల్సి ఉందని అన్నారు. ఇతర వివరాలకు 9949202332 నంబర్‌లో సంప్రదించవచ్చని అధికారి సూచించారు.