26, 27 తేదీల్లో బీసీల మహా ధర్నా

హైదరాబాద్‌,(జనంసాక్షి): అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ సబ్‌ప్లాన్‌ను రూపొందించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నాను నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ కే.లక్ష్మణ్‌ తెలిపారు. బీసీల అభ్యన్నతిని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలు విస్మరించాయని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. 65 శాతం బీసీలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.