26న షటిల్‌ బ్యాడ్మింన్‌ పోటీలు

ఆదిలాబాద్‌, జనవరి24: మంచిర్యాల మండలం సీసీసీ నస్పూర్‌ కాలనీలోని సాధన స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన షటిల్‌ బ్యాడ్మింన్‌ టోర్నమెంట్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు పోటీల నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు 26వ తేది మద్యాహ్నం మూడింటిల్లోపు సాధన స్పోర్ట్స్‌ క్లబ్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఇదిలావుంటే చెన్నూరు పట్టణంలోని జైహింద్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌లో ఈనెల 26న షటిల్‌ బ్యాడ్మింటన్‌ జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు స్థానిక జైహింద్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌లో సంప్రదించాలని కోరారు. పోటీల్లో పాల్గొనేవారు రూ.200 చెల్లించాలన్నారు. ప్రథమ స్థానం సాధించిన వారికి రూ.5వేలు, ద్వితీయ స్థానం నిలిచిన వారికి రూ.2వేలను అందజేయనున్నట్లు వివరించారు.