26/11 అమరులకు ఘన నివాళులు

– నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్ర పతి
న్యూఢిల్లీ, నవంబర్‌26(జనం సాక్షి) : ముంబయి మారణ¬మానికి నేటితో 11ఏళ్లు. భారత సైనికుల చేతికి చిక్కిన ఉగ్రవాది కసబ్‌ సహా 10మంది ముష్కరులు జరిపిన నరమేధం దేశ చరిత్రలో మరపురాని దుర్ఘటన. ఈ నెత్తుటి మరకలకు 11ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నేడు ఆనాటి అమరుల జ్ఞపకాలను స్మరించుకుంటున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సహా పలువురు ముఖ్యనేతలు వారికి నివాళులర్పించారు. ఈ మారణ¬మంలో ప్రాణాలు కోల్పోయివారి త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ స్మరించుకుంటుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాఖ్యానించారు. ఉగ్రవాద నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందిస్తూ 2008లో ముంబయి ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా హృదయపూర్వక శ్రద్దాంజలి ఘటిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా దేశాన్ని కాపాడటంలో ప్రాణత్యాగం చేసిన భద్రతా బలగాలకు నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదని వారి త్యాగాలను గుర్తుచేసుకున్నారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ముంబయిలోని పోలీసుల స్మారకం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మహారాష్ట్ర ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.