టీ ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

టీ ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌: తెలంగాణవాదుల అరెస్టులను నిరసిస్తూ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు యత్నించిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఎన్‌.ఆర్‌. నగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ఎంపీలు పోలీసుల చర్యకు  నిరసనగా క్యాంపు కార్యలయం వద్ద రోడ్డుపై భైఠాయించారు.