28న తెలంగాణపై అఖిలపక్ష భేటీ : తెలంగాణ కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఈ నెల 28న ఉదయం 10 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పటు చేయడానికి కేంద్ర హోంమంత్రి  సుశీల్‌కుమార్‌ షిండే అంగీకరించినట్లు టీ కాంగ్రెస్‌ ఎంపీలు ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడానికి సిద్ధంగా ఉందని ఎంపీలు మీడియాతో తెలిపారు. దీంతో తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న తమ బత్తిడి ఫలించిందని టీ కాంగ్రెస్‌ ఎంపీలు అన్నారు. కేవలం టీ కాంగ్రెస్‌ ఎంపీల ఒత్తిడి వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి  వెల్లడించారు. షిండేతో చర్చల అనంతరం పార్లమెంటు ఆవరణలో ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌డీఐలపై సాయంత్రం జరగనున్న ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని వారు తెలియజేశారు.