28న నేషనల్ సైన్స్ సెమినార్
ఖమ్మం, జూలై 19: ఈ నెల 28వ తేదీన ఖమ్మం పట్టణంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం పది గంటలకు జిల్లా స్థాయిలో మ్యాథమెటిక్స్ ఇన్ ఇండియా-పాస్ట్, ప్యూచర్ అనే అంశంపై నేషనల్ సైన్స్ సెమినార్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం, మదిర, డివిజన్లలోని ఉప విద్యాశాఖాధికారులు, డివిజన్లలో ఈ నెల 21వ తేదీ వరకు ఈ అంశంపై సెమినార్‌లు నిర్వహించి, 10 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారి పేర్లను 25వ తేదీలోగా డిఇఓ కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ నెల 28న జరిగే జిల్లా సెమినార్‌లో పాల్గొంటారన్నారు.