28న వైసీపీలో చేరుతున్నా
– చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు
– బీసీలకు జగన్ ఇచ్చిన హావిూలపై పూర్తి విశ్వాసం ఉంది
– కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి
హైదరాబాద్, ఫిబ్రవరి19(జనంసాక్షి) : ఈనెల 28న వైఎస్‌ఆర్ సీపీలో చేరుతున్నట్లు మాజీ కేంద్ర మంత్రి పిల్లి కృపారాణి అన్నారు. మంగళవారం ఆమె లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. పలు విషయాలపై జగన్‌తో చర్చించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 28న అమరావతిలో జరిగే కార్యక్రమంలో వైసీపీలో చేరనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఏపీని విడగొట్టి కాంగ్రెస్ అన్యాయం చేసిందని, ఇన్నాళ్లకి కాంగ్రెస్‌పై ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఆయన పాలన తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జగన్ సీఎం అయితేనే ఏపీలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. బీసీ గర్జనలో వైఎస్ జగన్ ఇచ్చిన హావిూలను పూర్తిగా విశ్వసిస్తున్నానన్నారు. చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేస్తారని అన్నారు. వైఎస్ జగన్ మాట తప్పరని, మడమ తిప్పరని అన్నారు. ప్రత్యేక ¬దాపై చంద్రబాబు మాట మార్చారని, ఏపీ ప్రజలు ఆయన మాటలు విశ్వసించరని అన్నారు. కాంగ్రెస్, టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తాను తీవ్రంగా వ్యతిరేకించానని.. రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశానని వెల్లడించారు. బీసీలను, కులవృత్తుల వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. టిక్కెట్ ఆశించి రాలేదని, భేషరతుగా వైసీపీలో చేరనున్నట్టు కృపారాణి స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.