3న కేంద్ర మంత్రివర్గ విస్తరణ

కొత్త వారికి కేబినెట్‌ లో చోటు

రాజీనామా చేసిన పలువురు మంత్రులు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రివర్గ విస్త్రణకు ముహుర్తం కుదిరింది. ఈ నెల 3న ఆదివారం ఉదయం పది గంటలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి కేబినెట్‌ ను విస్తరిస్తోంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో మాట్లాడిన ప్రధాని మోడీ మంత్రివర్గాన్ని తుదిరూపుకు తెచ్చారు. ఈ సారి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటికే కొత్తవాళ్లకు అవకాశం కోసం ఐదుగురు మంత్రులు రాజీనామా చేశారు. కీలక రాష్టాల్లో ఎన్నికల దృష్ట్యా కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం సహాయ మంత్రుల ¬దాలో ఉన్న వారికి ప్రమోషన్లు కూడా దక్కే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే రెండు, అంతకన్నా ఎక్కువ శాఖలు చూస్తున్న వారికి కూడా ఈ విస్తరణతో భారం తగ్గనుంది. అరుణ్‌జైట్లీ, స్మృతి ఇరానీ రెండేసి శాఖల బాధ్యతలు చూస్తున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, అన్నాడీఎంకేలకు కూడా మంత్రి వర్గంలో స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

మంత్రి పదవులకు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్‌ రాజీనామా

కేంద్ర మంత్రి పదవికి బండారు దత్తాత్రేయ రాజీనామా చేశారు. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తో సమావేశం తర్వాత ఆయన తన పదవి నుంచి వైదొలిగారు. ఈ మేరకు దత్తాత్రేయ ప్రధాని మోడీకి రాజీనామాను సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే దత్తాత్రేయకు బీజేపీ అధిష్టానం ఆయనకు గవర్నర్‌ పదవి ఇస్తామని హావిూ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు మంత్రి పదవికి నిర్మలా సీతారామన్‌ కూడా రాజీనామా చేశారు. అయితే నిర్మలా సీతారామన్‌ను పార్టీకి విూడియా తరఫున ఛీప్‌గా నియమించాలని అధిష్టానం భావిస్తోంది. మొత్తానికి కొత్త మంత్రి వర్గం 2019 ఎన్నికల కేబినెట్‌గానే చూడాలని విశ్లేషకులు చెబుతున్నారు.