30 మంది వైద్యులు.. 11 గంటల ఆపరేషన్..

ఫిలిడెల్ఫియా: శరీరాలు అతుక్కుని జన్మించడంతో అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు  మొదటి పుట్టినరోజే మరచిపోలేని రోజుగా మారింది. తలలు అతుక్కుని జన్మించడంతో ‘క్రనియోపగస్’ అనే వ్యాధితో బాధపడుతున్న ఇరిన్, అబ్బే డిలానే అనే చిన్నారులకు వైద్యులు విముక్తి కల్పించారు. చిన్నారుల ఆరోగ్యపరిస్థితిపై అధ్యయనం చేసిన వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. వివిధ విభాగాల్లో అనుజ్ఞులైన 30 మంది వైద్యులు కలిసి 11 గంటలుపాటు శ్రమించారు. విజయవంతంగా ఆపరేషన్ ద్వారా చిన్నారులను వేరేచేశారు. అనుభవజ్ఞులైన వైద్యులు తమ నైపుణ్యంతో మొత్తం 23 ఆపరేషన్ల చేసి చిన్నారులను వేరు చేశారు. నార్త్‌కరోలినాకు చెందిన ఈ చిన్నారులకు ఫిలిడెల్ఫియా నగరంలోని ఓ హాస్పిటల్లో ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ విజవంతమైందని, చిన్నారులు ఆరోగ్యంగా ఐసీయూలో ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇదిలావుండగా చిన్నారులు జన్మించిన సంవత్సరానికి జూన్ 7న ఈ ఆపరేషన్ జరగడం విశేషం. దీంతో మొదటి పుట్టినరోజున చిన్నారులు మంచి బహుమతి అందుకున్నారని వైద్యులు  తెలిపారు. ఇదిలావుండగా వైద్యులు అద్భుతం చేశారని పలువురు అభినందిస్తున్నారు.