30 రోజుల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులు – కేటీఆర్..
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్ పక్కా ప్రణాళికతో ముందు కెళ్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నరు. అందులోభాగంగా ఎంఏయూడీపై వందరోజుల యాక్షన్ ప్లాన్ ను మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
వాయిస్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుపై మంత్రి కేటీఆర్ కసరత్తు ప్రారంభించారు. అందులోభాగంగా బేగంపేటలోని హరితప్లాజాలో మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ పై రివ్యూ నిర్వహించారు. అనంతరం ఎంఏయూడీపై వందరోజుల యాక్షన్ ప్లాన్ ను మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
జీహెచ్ఎంసీలో 30 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. నగరంలో 200 కోట్లతో 569 బీటీ రహదారుల నిర్మాణం, 30 కోట్లతో నాలాల క్రమబద్దీకరణ, కోటి రూపాయలతో 10 శ్మశానవాటికల నిర్మాణం, 3 కోట్లతో 50 బస్బేల నిర్మాణం, 26 కోట్లతో 40 మోడల్ మార్కెట్ల నిర్మాణం చేపడుతామన్నారు. అటు 20 కోట్లతో లేఔట్లకు ప్రహరీ గోడలు నిర్మించి పరిరక్షిస్తామన్నా మంత్రి.. 40 కోట్లతో 32 వేల నల్లా కనెక్షన్లు, వెయ్యికిపైగా ఇంకుడు గుంతలు తవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
నగరంలో చెత్త తరలింపునకు 2,500 స్వచ్ఛ ఆటోల ద్వారా సేవలందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలో 20 కాలనీల్లో పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలో 25 కిలోమీటర్ల మేర వరల్డ్ క్లాస్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా సంఘాలకు వంద రోజుల్లో 100 కోట్లు విడుదల చేస్తామన్నారు.
ఈ-ఆఫీస్ ద్వారా ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు యూత్క్లబ్, అసోసియేషన్ల సహకారంతో జిమ్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. 329 క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలోని15 మున్సిపాలిటీల్లో టాయిలెట్లు నిర్మిస్తామన్నారు. ప్రజా ఫిర్యాదుల కోసం ప్రత్యేక జీహెచ్ ఎంసీ పోర్టల్, యాప్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన మంత్రి.. సమస్యలపై ఫిర్యాదు కోసం హెచ్ఎండీఏ టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. బైట్:
ఎండ్వాయిస్: అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. అన్ని శాఖల సమన్వయంతో యాక్షన్ ప్లాన్ అమలుచేసి.. మళ్లీ వంద రోజుల తర్వాత ప్రజలకు అన్ని వివరిస్తమన్నారు.