ఖమ్మం, అక్టోబర్‌ 18: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వృత్తి వ్యతిరేక విధానాల వల్ల   కల్లు గీత వృత్తి పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలకు లైసెన్సులు రెన్యువల్‌ను ఎలాంటి కోత లేకుండా ఉచితంగా అమలు చేయాలని, దాని ద్వారా కల్లుగీత కార్మికులను ఆదుకోవాలని ప్రోహిబిషన్‌ ఎక్సైజ్‌ అధికారులను కోరారు. వివిధ రకాల ఖర్చుల పేర్లు చెప్పి ఒక్కొక్క సొసైటీకి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. కల్లుగీత సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో అంతడబ్బు చెల్లించే స్థితిలో కార్మికులు లేరని నాగేశ్వరరావు అన్నారు.