32 వ జాతీయస్థాయి ఖో, ఖో పోటీలకు నలుగురు విద్యార్థులు వెళ్ళడం సంతోషకరం
పీఆర్టీయూ దోమ మండల అధ్యక్షుడు ఆర్.కేశవులు
ముంబాయి రాష్ట్రము సతారా జిల్లా, పల్తాన్ ప్రాంతంలో జరుగుతున్న అండర్ 14 ,జాతీయస్థాయి ఖో, ఖో పోటీలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి ఆరుగురు విద్యార్థులు సెలక్ట్ కాగా అందులో జిల్లాపరిషత్ దిర్సంపల్లి పాఠశాల నుండి నలుగురు విద్యార్థులు పి. మధు ప్రియా రెడ్డి,పి. వైశాలి ,పి. సాయి సుజన్ , కె.భరత్ సెలెక్ట్ అయ్యారు . సెలెక్ట్ అయ్యి ముంబాయి బయలుదేరిన విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరచి విజయంతో తిరిగి రావాలని పీఆర్టీయూ దోమ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్.కేశవులు , కె. ప్రభాకర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు .విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంలో నిరంతరం కృషి చేసిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు జి.గోపాల్ ,అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు