34మంది సీఏల ఆఫీసులపై ఈడీ దాడులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు 34మంది చార్టెడ్ అకౌంటెంట్స్ (సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్)ల ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. షెల్ కంపెనీల పేరుతో చట్ట బద్దంగా బ్లాక్‌మనీని వైట్‌మనీగా చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, ఈడీ అధికారులు అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. మార్చి నెలలో ఈడీ అధికారులు ఈ వ్యవహారంలో సురేంద్రకుమార్ జైన్, వీరేంద్ర జైన్ జైన్ ( జైన్ బ్రదర్స్)ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈడీ అధికారులు ఇప్పటికే సీఏలు, సీఎస్ లకు ఈడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

తాజావార్తలు