36 నెలలో.. పర్యాటకప్రాంతంగా మూసీతీరం
` సమూలంగా ప్రక్షాళన చేస్తాం
` థేమ్స్ తరహాలో మూసీని తీర్చిదిద్దుతాం
` అభివృద్ధిలో ప్రపంచదేశాలతో పోటీపడతాం.. పొరుగురాష్ట్రాలతో కాదు
` పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ను వంద మీటర్లలోతులో బొందపెడతాం
` ప్రజాపాలను చూసి ఓర్వలేకపోతున్నారు
` భారాసపై మండిపడ్డ సీఎం రేవంత్‌రెడ్డి
` సకల సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారమని వ్యాఖ్య
హైదరాబాద్(జనంసాక్షి):రానున్న మూడు సంవత్సరాల్లో మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేస్తామని, లండన్‌లోని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లను కలుసుకున్నారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ’భారత్, బ్రిటన్ మధ్య బలమైన బంధాలలో ఒకటైన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యవసరం…’అన్నారు. వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ ను యునెస్కో 1016 సంవత్సరంలోనే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చారిత్రక భవనంలో జరిగిన సమావేశంలో లేబర్ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు మరో ఏడుగురు ఎంపీలు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. హింస, ఉగ్రవాదం, ప్రజల హక్కుల హరణ, ప్రజాస్వామ్యంపై దాడి లాంటి సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటోంది. కేవలం ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలను శక్తిమంతులను చేయటమే అసలైన పరిష్కారం అని అన్నారు. ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ’ఒకప్పుడు విూ దేశం మా దేశాన్ని పరిపాలించింది. మా కాంగ్రెస్ పార్టీనే విూకు వ్యతిరేకంగా పోరాడిరది. అప్పుడు మహాత్మగాంధీ ఎంచుకున్న సత్యం, అహింస, న్యాయ పోరాటమే విూ దేశానికైనా మా దేశానికైనా ఇప్పటికీ మార్గదర్శకాలు…అన్నారు. ఇదే సందర్భంగా తన స్వీయ అనుభవాలను సీఎం పంచుకున్నారు. ’నాది గ్రావిూణ ప్రాంతం.నేను సామాన్య రైతు బిడ్డను. కేవలం ప్రజాస్వామ్యం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నేనున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భావనను నరనరాన జీర్ణించుకున్న పార్టీ. నాకు ఈ అవకాశం వచ్చినట్లే.. దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందే అవకాశం ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తేనే సాధ్యమవుతుందని అన్నారు.
బిఆర్‌ఎస్‌ను బొందపెట్టి తీరుతాం
వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను మరింతగా బొందపెట్టడం ఖాయమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా నెట్టే ఛాన్స్ లేదని లండన్ పర్యటనలో ఉన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. పులి బయటికి వస్తే బోనులో వేసి చెట్టుకు వేళాడదీస్తామని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న తెలంగాణ వ్యక్తులు, కాంగ్రెస్ అభిమానులతో రేవంత్ భేటీ అయ్యారు. ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ చుద్దామన్నా కూడా కనిపించదని వ్యాఖ్యానించారు.అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ గుర్తే ఉండదని రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి లండన్ వేదికగా స్పందించారు. ఒక్క ఎన్నిక విషయంలోనే బీఆర్‌ఎస్ నేతలు బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ నేతలకు మాత్రం ఆహంకారం తగ్గలేదన్నారు. వారి గర్వం, అహంకారం తగ్గించే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమిపాలైన తర్వాత వారికి భయం పట్టుకుని ఇలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.