38వ రోజు టీఆర్‌ఎస్ పల్లెబాట
హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా టీఆర్‌ఎస్ చేపట్టిన పల్లెబాట 38వరోజుకు చేరుకుంది. పది జిల్లాలో పల్లెబాట జోరుగా కొనసాగుతోంది. వీధులన్ని ‘ జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగుతున్నాయి. గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పల్లెబాటలో భారంగా ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తెలంగాణ సాధించే వరకు పోరాడుతామపి తేల్చిచెబుతున్నారు. సీమాంథ్ర పార్టీలకు భరతం పడుతామని స్పష్టం చేస్తున్నారు. 28లోగా తెలంగాణపై నిర్ణయం ప్రకటించకపోతే .జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు. పల్లెబాటలో భారీగా తెలంగాణవాదులు పాల్గొంటున్నారు.