4గంటల కరెంట్‌ కావాలా…మూడు గంటల కావాలా.

మంథని, (జనంసాక్షి) : తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ పరిపాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా మంగళవారం మంథని మున్సిపల్‌ పరిదిలోని 1వ వార్డు పవర్‌ హౌజ్‌ కాలనీ, చైతన్యపురి కాలనీ, శ్రీరామ కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేసి కారు గుర్తుకు ఓటు వేయాలని, ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్‌ను గెలిపించుకోవాలని కోరారు. ఈ సందర్బంగా ప్రతి ఇంటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనీఫెస్టో పథకాలు, పుట్ట మధూకర్‌ చేసిన అభివృద్ది సేవలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆనాడు పుట్ట మధూకర్‌ను ఆదరించి ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే ఎంతో అభివృద్ది చేశారని, తన తల్లిపేరున స్థాపించిన పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా అనేక సేవలు అందించారన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు పుట్ట లింగమ్మ ట్రస్టు సేవలు అందని ఇల్లు లేదన్నారు.విద్యా వైద్యంతో పాటు పేద వర్గాలకు ఆకలి తీర్చిన గొప్ప సేవకుడు పుట్ట మధూకర్‌ అని వివరించారు. తొమ్మిదేండ్ల కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా చేసిన అభివృద్ది, సేవలు మీ కళ్ల ముందే కన్పిస్తున్నాయని ఆమె అన్నారు. సేవ చేసే నాయకుడు కావాలా ఐదేండ్ల కోసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. అంతేకాకుండా రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేసి 24 గంటల కరెంటుతో పాటు రైతుబీమా, రైతుబందు పెట్టుబడి సాయం అందిస్తుంటే కాంగ్రెస్సోళ్లు మూడు గంటల కరెంటు ఇస్తామని, రైతుబందు దుబారా ఖర్చు అని మాట్లాడుతున్నారని,24 గంటల కరెంటు కావాలో 3 గంటల కరెంటు కావాలా రైతులు ఆలోచన చేయాలన్నారు. ఎన్నికలు వచ్చాయని అధికారం పదవుల కోసం ఆరు అబద్దపు పథకాలతో మన ముందుకు వస్తున్నారని, ఐదేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఏమీ చేయనోళ్లు ఆరు పథకాలు ఎలా అమలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు అవుతాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్‌ రక్షకుడిగా నిలుస్తారని,మంథని ప్రాంత ప్రజల బతుకులకు భరోసా ఇచ్చేది పుట్ట మధూకర్‌ అని ఆమె అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పేదింటి బిడ్డ భవిష్యత్‌ బాధ్యత పుట్ట మధూకర్‌ తీసుకుంటారని ఆమె హమీ ఇచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ మూడోసారి రావడం ఖాయమని, మంథనిలో సైతం కారు గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డగా పుట్ట మధూకర్‌ను ఆదరించి ఆశీర్వదించాలని ఆమె కోరారు