4వ విడత పట్టణ ప్రగతి సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న – కౌన్సిలర్ శ్వేతారంజిత్

గద్వాల రూరల్ జూన్ 03 (జనంసాక్షి):- గద్వాల పట్టణంలోని 37వ వార్డులో జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పటానున్న 4వ విడత పట్టణ ప్రగతి సమీక్ష సమావేశం కార్యక్రమంలో 37వ వార్డ్ కౌన్సిలర్ శ్వేతారంజిత్ కుమార్ పాల్గొన్నారు..ఈ సందర్బంగాశ్వేతారంజిత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు,,మంత్రి కేటీఆర్ గారు,గద్వాల్ శాసనసభ్యులు, మున్సిపల్ చైర్మన్  ఆలోచన విధానంతో గద్వాల్ పట్టణంలో అన్ని వార్డులు రూపురేఖలు  మారుతున్నాయాన్నారు. ప్రభుత్వం పరిపాలన ప్రజలు వద్దకు తీసుకెళ్లి వార్డు ప్రజలను భాగస్వాములుగా చేస్తూ వార్డులో నెలకొన్న సమస్యలు పరిశుభ్రత ఇంకుడు గుంతల నిర్మాణం ఖాళీ స్థలల్లో మొక్కలు నాటడం విద్యుత్ సమస్యలు వివిధ సమస్యలు తెలుసుకొన్ని వాటిని పరిష్కారానికి ప్రణాళిక రూపొందించి  ప్రత్యేక కార్యాచరణతో పరిష్కరించడమే 4వ విడత పట్టణ ప్రగతి లక్యం అన్నారు. 37వ వార్డును సుందరంగా తీర్చి దిద్దడంలో వార్డ్ ప్రజలు అందరు సహకరించి మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని శ్వేతారంజిత్ పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెరాస పార్టీ నాయకులు నజీర్ .మియ్య .రియాజ్ కార్యకర్తలు వార్డ్ ప్రజలు యూత్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.