ఫిబ్రవరి 4న జీవోఎం కీలక భేటీ

లోక్‌సభలో టీ బిల్లుకు తుది కసరత్తు
ఉమ్మడి రాజధాని, గవర్నర్‌ అధికారాలు, సీమాంధ్రకు కొత్త రాజధాని, పోలవరానికి జాతీయ హోదాలాంటి ఆరు సవరణలపై చర్చ
శరవేగంతో ఫైనల్‌ బిల్‌
న్యూఢిల్లీ, జనవరి 29 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ నుంచి బిల్లు ఏ రూపంలో వచ్చినా లోక్‌సభలో ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన మంత్రుల బృందం(జీవోఎం) తదుపరి సమావేశం ఫిబ్రవరి 4న జరుగనుంది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర ¬ం మంత్రి షిండే నేతృత్వంలో జరగనుంది. తెలంగాణ బిల్లుతో పాటు ఆరు ప్రధాన సవరణ ప్రతిపాదనలను జీవోఎం పరిశీలించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4న కేంద్ర మంత్రుల బృందం చివరిసారి భేటీ కానుంది. 4న సాయంత్రం 5 గంటలకు ¬ంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే అధ్యక్షతన సమావేశమై తెలంగాణ బిల్లుపై జీవోఎం సభ్యులు చర్చించనున్నారు. బిల్లులో సవరణకు సంబంధించి వచ్చిన ఆరు ప్రధాన ప్రతిపాదనలను సభ్యులు పరిశీలించనున్నారు. అయితే ఫిబ్రవరి 8 తర్వాత ఎప్పుడైనా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రామేశ్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఉమ్మడి రాజధాని, గవర్నర్‌ అధికారాలు, సీమాంధ్రకు కొత్త రాజధాని, పోలవరానికి జాతీయ హోదాలాంటి ఆరు సవరణలపై చర్చించనున్నారు. బిల్లు సక్రమంగా ఉందన్న సందర్భంలో ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో కేంద్రం ఇప్పుడు శాసనసభలో చర్చ జరుగుతున్న తీరును సీరియస్‌గా గమనిస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర విభజన విషయంలో యూపీఏ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 11వ తేదీన లోక్‌ సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ముందు 4న జివోంలో తుది కసరత్తు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై అసలు చర్చ పూర్తి కాలేదు. బిల్లుకు ఇప్పటికే వేల సంఖ్యలో సవరణలు వచ్చాయి. ఈలోపే లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్‌ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. సమాయాభావం వల్ల, సమావేశాలు ముగిసిపోయే అకాశం ఉన్నందున ఈలోపే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా, తెలంగాణపై కేంద్ర ¬ం శాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఇదే ఆ బృందం చిట్టచివరి సమావేశం అవుతుందని చెబుతున్నారు. ఈ జీవోఎం బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు కూడా బిల్లుపై జీవోఎం తుది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ తుది చర్చలు పూర్తయిన తర్వాత కేంద్ర మంత్రివర్గం ముందుకు ఫిబ్రవరి 7వ తేదీన తెలంగాణ బిల్లు వెళ్తుందని సమాచారం. ఈ కసరత్తు మొత్తం పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 11 లేదా 12 తేదీలలో తెలంగాణ బిల్లు లోక్‌సభ ముందుకు రానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ ఈసారి కూడా బిల్లును సభలో ప్రవేశపెడతారని అంటున్నారు. సవరణల గురించి ఆయనతో ప్రస్తావించగా, బిల్లుకు తప్పకుండా వేల సంఖ్యలో సవరణలు వస్తాయని, వాటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యేలోపు తాము తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. దీంతో ఆంధప్రదేశ్‌ అసెంబ్లీలో విభజన బిల్లు వ్యవహారం ముగిసినట్లేనని కేంద్ర ¬ంశాఖ భావిస్తోంది. అసెంబ్లీలో చర్చకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు 30వ తేదీతో ముగిసిన తర్వాత అసలు వ్యవహారం మొదలు కానుందని తెలుస్తోంది. ముసాయిదా బిల్లును తిప్పి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన నోటీసు ప్రకారం.. అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఓటింగ్‌ జరిపే అవకాశం లేనందున తాము అనుకున్నది చేసుకుపోవచ్చనేది వారి అభిప్రాయంగా ఉంది. మరోవైపు సీఎం గడువు పెంచాలని కోరినా అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. ఇందులో భాగంగానే ఇప్పటివరకూ అసెంబ్లీలో జరిగిన చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు అనధికారికంగా తెప్పించుకుంటోంది. అసెంబ్లీ నుంచి అధికారిక సమాచారం వచ్చేలోగానే తుది బిల్లు రూపకల్పన పనిని పూర్తి చేయాలని కేంద్ర ¬ంశాఖ భావిస్తోంది. గడువు పెంపు కోసం ముఖ్యమంత్రి లేఖ రాసినా ఇచ్చే పరిస్థితి లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. తాము రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూనే బిల్లు తయారు చేసినట్లు ఇప్పటికే కేంద్రమంత్రి జైరాం రమేశ్‌ పేర్కొన్న విసయం తెలిసిందే. ఒకవేళ 30వ తేదీ వరకూ సభ నడవకున్నా బిల్లు కేంద్రానికి వెళ్లడం ఖాయమని తెలంగాణ నేతలు నమ్మకంగా ఉన్నారు. అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసుపై తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కూడా కన్పించడం లేదు. బిల్లు వివాదంపై ¬ంశాఖ వర్గాలూ జైరాం రమేష్‌ లాగానే స్పందిస్తున్నాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టేంతవరకూ దీన్ని ముసాయిదా బిల్లే అంటారని, ముఖ్యమంత్రి దీనిపై అనవసర రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎవరో తప్పుడు సలహా ఇచ్చి ఉంటారని అంచనా వేస్తున్నాయి. ఇక నుంచి సభ జరిగే అవకాశం లేనందున బిల్లుపై సభాభిప్రాయం తెలిసే అవకాశం లేదని పేర్కొంటున్నాయి. సభ్యులు వ్యక్తిగతంగా ఇచ్చే అభిప్రాయంకంటే సభాపరంగా ఇచ్చే దానికే ఎక్కువ విలువ ఉంటుందని, ఇప్పుడు సభాభిప్రాయం వచ్చే అవకాశం లేదని ¬ంశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే 4న జీవోఎం భేటీ తరవాత 5నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాలు కీలకం కానున్నాయి.