సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ

నవంబర్ 12(జనంసాక్షి): : సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ కలకలం సృష్టించింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బీదర్ హైవేపై ఒక లారీని ఆపి అందులో ఉన్న రూ.20లక్షల విలువైన లోడ్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బీదర్ నుంచి దాదాపు రూ.20 లక్షల పాన్ మసాలా గుట్కా లోడ్‌తో సోమవారం రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరింది. ఈ విషయం తెలుసుకున్న దుండగులు లారీని వెంబడించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగా చౌరస్తా సమీపంలో లారీని ఆపేశారు. పోలీసులమని చెప్పి లారీని నిమ్జ్ వెంచర్‌లోకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత లారీ డ్రైవర్‌తో పాటు లారీలో ఉన్న ఇద్దరిని కిందకు దించేశాడు. అనంతరం వారి దగ్గర ఉన్న సెల్‌ఫోన్‌లను లాగేసుకున్నారు. వారిని కారులో నిర్బంధించి కర్ణాటక సరిహద్దుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ లారీలో ఉన్న రూ.20 లక్షల విలువైన లోడ్‌ను తమ వాహనంలో ఎక్కించుకున్నారు. అలాగే లారీలో ఉన్న ఇద్దరి నుంచి రూ.42 వేల నగదును లాక్కున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
దుండగుల నుంచి తప్పించుకున్న లారీ డ్రైవర్, మరో ఇద్దరు అదే రాత్రి హద్నూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.



