415 రన్స్ చేసిన భారత్

 yuvraj_bat_england_300విశాఖలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ లో భారత్ రెండవ రోజు భోజన విరామ సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 415 రన్స్ చేసింది. అశ్విన్ 47, జయంత్ 26 రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు. ఉదయం కెప్టెన్ కోహ్లీ 167 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇవాళ ఇంగ్లండ్ బౌలర్లు లంచ్ విరామం లోపు మూడు వికెట్లను పడగొట్టారు. అయినా భారత్ మాత్రం వేగంగానే పరుగులను సాధిస్తోంది. తొలి సెషన్ లో భారత్ 98 రన్స్ సాధించింది. విశాఖ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. సాహా, జడేజాలను స్పిన్నర్ మొయిన్ అలీ ఔట్ చేశాడు. జయంత్ యాదవ్ ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. అశ్విన్ కూడా మరో సారి బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు.