42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేం

` చేతులెత్తేసిన భాజపా
` సాధ్యం కాదని తెలిసీ కాంగ్రెస్‌ బీసీ ఓట్ల రాజకీయం
` రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో ఎలా చేరుస్తారు?
` దానికి సుప్రీం కోర్టు ఒప్పుకోదు
` అంతా తెలిసినా కావాలనే రాజకీయాలు చేస్తున్నారు.
` ఢల్లీిలో మీడియా సమావేశంలో తెలంగాణ బీజేపనీ అధ్యక్షుడు రామచంద్రరావు
న్యూఢల్లీి(జనంసాక్షి):బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం, భాజపాపై నిందలు వేస్తే ఊరుకోబోమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని.. సాధ్యం కాదని తెలిసినా బిల్లు తీసుకొచ్చారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా.. ఓటు- బ్యాంకు పాలిటిక్స్‌ కోసం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దిల్లీలో నిర్వహించిన విూడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడారు. అసాధ్యమైన పనిని కేంద్రంపైకి నెట్టివేస్తున్నారన్నారు. భాజపా, కేంద్ర ప్రభుత్వంపై నిందలు వస్తే ఊరుకోం. విూకు న్యాయ సలహాదారులు లేరా?ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్‌ తీసివేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ముస్లింలకు ఇచ్చినవి రాజకీయ రిజర్వేషన్లు.. అందుకే వ్యతిరేకిస్తున్నాం. 42 శాతం బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లోకి తీసుకురాలేం. దానికి సుప్రీంకోర్టు అనుమతించదు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని రామచంద్రరావు ప్రశ్నించారు. పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై పెద్దల మార్గదర్శనం తీసుకునేందుకు ఢల్లీికి వచ్చానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌ రావు అన్నారు. 46 సార్లు ఢల్లీికి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డికి రాహుల్‌ గాంధీ అపాయింట్‌మెంట్‌ దక్కలేదన్నారు. కానీ ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులందరూ ఎప్పుడు అడిగితే అప్పుడు రేవంత్‌ రెడ్డికి సమయం ఇచ్చారని, విూ పార్టీ ముఖ్యమంత్రికి విూరే ఎందుకు సమయం ఇవ్వడం లేదు చెప్పాలన్నారు రామచందర్‌ రావు. మతపరమైన రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం కేంద్రం బాధ్యత అని అని అంటున్నారని, లీగల్‌ ఒపీనియన్‌ లేకుండా ఆర్డినెన్స్‌ తీసుకువచ్చారన్నారు. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే అంశాలు కూడా న్యాయ సవిూక్షకు లోబడి ఉంటాయని కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, 2006లో అయ్యర్‌ కోహ్లీ కేసులో .. సుప్రీంకోర్టు మరోసారి కేశవనంద భారతి కేసు తీర్పు ను దగ్గర మరోసారి పునరుద్ఘాటించిం దన్నారు. తెలంగాణ బీసీలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి ఆర్డినెన్స్‌ తెచ్చారని, న్యాయపర మైన చిక్కులు తెలిసి …బీసీలను మోసం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలన్నారు. బీసీ బిల్లుకు, ఆర్డినెన్స్‌ కు మద్దతు ఇచ్చాం.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీదేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఎన్నికలు జరగకుండా ఉండేందుకు జరిగే ఎత్తుగడే ఈ మోసమని ఆయన ఆరోపించారు. తమిళనాడు తీర్పు నేపథ్యంలో …తొమ్మిదో షెడ్యూల్‌ లో పెట్టే పరిస్థితి లేదని, పార్టీ క్రమశిక్షణ దాటితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు రామచందర్‌రావు. నాయకులందరూ పార్టీ విధానాలకు లోబడే పని చేయాలని, ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాంగ్రెస్‌లో రేవంత్‌ రాజగోపాల్‌ రెడ్డి మధ్య సమస్యలు.. బీఆర్‌ఎస్‌ లో కవితకు పార్టీకి మధ్య గొడవలు ఉన్నాయన్నారు. ప్రతి పార్టీలోనూ గొడవలు ఉన్నాయి వాటిని అంతర్గతంగా పరిష్కరించుకుంటామన్నారు.