నిలిచిపోయిన ఎన్టీపీసీ 5వ యూనిట్‌ మరమ్మత్తులు చేస్తుండగా ఇద్దరికి తీవ్రగాయాలు

నిలిచిపోయిన ఎన్టీపీసీ 5వ యూనిట్‌
మరమ్మత్తులు చేస్తుండగా ఇద్దరికి తీవ్రగాయాలు
కరీంనగర్‌, జ్యోతినగర్‌: ఎన్టీపీసీలోని 5వ యూనిట్‌లో గురువారం సాంకేతిక లోపంతో పని నిలిచిపోయింది. దీంతో దానికి మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారి విద్యుత్‌ ఫ్లాష్‌ ఓవరై ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాయిలర్‌ సమీపంలో బ్రేకర్లు మరమ్మత్తులు చేస్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి విలియమ్స్‌, ఒప్పంద కార్మికుడు వలిపిరెడ్డి లక్ష్మీరాజంకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఎన్టీపీసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అదించిన అనంతరం క్షతగాత్రులను హైదరాబాద్‌కు పంపించారు.