50 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ఆశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం. పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వూట్టపల్లి సమీపంలో భద్రాచలం రహదారిపై ఐదుడుగల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అశ్వరావుపేట నుంచి మండలంలోని దిగువ 50 గ్రామాలతోపాటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధాలు తెగిపోయాయి. వాగుఒడ్డుగూడెం వద్ద నల్లపాడు ఉద్ధృతంగా ప్రవహించడంతో పశ్చిమగోదావరి జిల్లా పూచికపాడు, దొరమామిడి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని కట్లం వాగు, కన్నాయిగూడెం కొండ్రోతు వాగు పెద్ద వాగు, గుండేటివాగు నుంచి వరద ఉద్ధృతితో పెద్దవాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి వరద నీటిని గోదావరిలోకి వదిలారు.