55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు
1.48 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా
వెల్లడిరచిన మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్,అగస్టు23(జనంసాక్షి): ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో దాదాపు 55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయనున్నట్లు అంచనాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌లో 1.48 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కావొచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వానాకాలం సాగు పురోగతిపై మార్కెటింగ్, పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. ధాన్యం ఉత్పత్తి అంచనా, కొనుగోళ్లు తదితర అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. ఎఫ్‌సీఐ 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అంగీకరించినట్లు ఆయన వెల్లడిరచారు. మరో 20 లక్షల టన్నులు అదనంగా సేకరించాలని ఎప్‌సీఐకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు.