56 వ రోజు వీఆర్ఏల వంటావార్పు
దంతాలపల్లి సెప్టెంబర్ 18 జనం సాక్షి
పే స్కేలు అమలు చేయాలని,ప్రమోషన్లను వెంటనే ప్రకటించాలనే డిమాండ్లతో గత 56 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్ఏలు దీక్షా శిబిరం వద్ద వంటావార్పు ఏర్పాటుచేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు పులుగుజ్జ మధుసూదన్ మాట్లాడుతూ… గత 56 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న మా న్యాయమైన కోరికలు తీర్చడంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వo స్పందించి మా డిమాండ్స్ అంగీకరించి మాకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వీఆర్ఏ నాయకులు ప్రసన్న,లావణ్య,వీరన్న,తదితరులు పాల్గొన్నారు.