62 ప్రైవేటు బస్సులు స్వాధీనం
75 కేసులు నమోదు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తగా ప్రైవేటు బస్సులు, పాఠశాలల బస్సులపై రవాణాశాఖ తనిఖీలు నాలుగోరోజూ కొనసాగుతున్నాయి. రహదారులపై తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డ అదికారులు వేకువజామునుంచే హైవేలు, చేక్‌పోస్టులు, రహదారులపై తనిఖీలు చేపట్టారు. ఒంగోలు, గూంటూరు, ఏలురూ తిరుపతి, హైదరాబాద్‌లలో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 62 ప్రైవేటు బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులో 16, ఏలూరులో 2, తిరుపతిలో,4 ఒంగోలులో 22, నెల్లూరులో 18 బస్సుంలు పట్టుబడ్డాయి. వీటితో పాటు మరో 75 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, బోరబండ, దిల్‌సుఖ్‌నగర్, మెహదీపట్నంలో ప్రత్యేక బృందాలు పాఠశాలల బస్సులను తనిఖీలు చేస్తున్నాయి. నగరంలో పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్న 4 సెట్విస్ బస్సులను అధికారులు అదుపులోని తీసుకున్నారు.