63 వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న : సీఎం
రంగారెడ్డి: జిల్లాలోని తుమ్మలూరు రిజర్వ్ ఫారెస్టులో 63వ వపమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం కిరణకుమార్‌రెడిక్డ ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ ఒక్క రోజు 20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని’ తొలి మొక్క నాటి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ చెట్లను పెంచడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తుంచుకోవాలని సూచించారు. వృక్షాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. కోర్టు కేసుల వల్ల స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని విదేశాలకు అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. తుమ్మలూరు రిజర్వు ఫారెస్టులోని ఐదు వేల హెక్టార్లలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజుతో పాటు రెండు వేల మంది విద్యార్థులు మొక్కలు నాటారు.