టీమిండియాను చూసి గర్విస్తున్నా: విరాట్‌ కోహ్లి

పోర్ట్‌ ఆఫ్‌స్పెయిన్‌,(జనంసాక్షి): ముక్కోణపు వన్డే టోర్నిలో కీలక సమయంలో విజయం సాధించడం పట్ల టీమిండియా తాత్కాలిక కెప్టెణ్‌ విరాట్‌ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. యంగ్‌ ఇండియా టీమ్‌ ప్రతిభకు గర్విస్తున్నానని పేర్కొన్నాడు. ట్రైసిరీస్‌ లో భాగంగా మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి భారత్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.
ఆరంభంలో ఓటములు చవిచూసినప్పటికి రెండు పెద్ద విజయాలతో ఫైనల్‌ చేరడం తమ జట్టు సత్తా ఏంటో చెబుతుందని మ్యాచ్‌ ముగిసిన అనంతరం కోహ్లి అన్నాడు. యంగ్‌ ఇండియా పుంజుకుని పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలవడం పట్ల అతడు హర్షం వ్యక్తం చేశాడు. తమ ప్రదర్శన సామర్థ్యానికి తగినట్లు ఉందని సంతృప్తి వ్యక్తం చేశాడు.
అన్ని విభాగాల్లో సమంగా రాణించి శ్రీలంకపై విజయం సాధించాలమని కోహ్లి చెప్పాడు. వర్షం గురించి తాము ఆలోచించలేదని, సహజధోరణిలోనే ముందుకోళ్లామని వివరించారు. బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ అద్బుతంగా రాణించారని ప్రశంసించాడు. ఫైనల్‌ మ్యాచ్‌కు ధోని నాయకత్వం వహించే అవకాశముందని అంతకుముందు కోహ్లి చెప్పాడు.