అమెరికా చేరుకున్న చిదంబరం
వాషింగ్టన్,(జనంసాక్షి): భారత ఆర్థిక మంత్రి పి.చిదంబరం అమెరికా రాజధాని వాషింగ్టన్ చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు ఆయనిక్కడ పర్యటిస్తారు. ఆరు నెలల్లోపే రెండోసారి ఆయన అమెరికా పర్యటనకు వచ్చాడు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ భారీగా పతనమవుతున్న నేపథ్యంలో చిదంబరం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ 38 లీడర్ షప్ వార్షిక సమావేశంలో ఆయన కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. అమెరికా ఆర్థిక మంత్రి జాక్‌ల్యుతో ఆయన సమావేశమవుతారు. అమెరికా కార్పొరేట్ లీడర్లు, విధాన నిర్ణేతలతోనూ ఆయన భేటీ అవుతారు.