భాక్రా డ్యామ్‌లో రికార్డు స్థాయికి చేరిన నీటిమట్టం
చండీఘడ్: భాక్రా డ్యామ్ వద్ద నీటి మట్టం రికార్డు స్థాయికి చేరింది. గత 40-50 ఏళ్లలో ఈ స్థాయికి నీటిమట్టం ఎప్పుడూ పెరగలేదు. దాంతో భక్రా బియాన్ మేనేజ్‌మెంట్ బోర్డు పంజాబ్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది. అదనంగా ఉన్న నీటిని సట్టెజ్, బియాన్ నదులలోకి వదలబోతున్నామని, సిద్ధంగా ఉండమని సూచించింది. అయితే వరదలొచ్చేలాగా కాకుండా క్రమపద్ధతిలో నీటి విడుదల ఉంటుందని స్పష్టం చేసింది. రుతుపవనాలకు ముందు ఎక్కువగా వర్షాలు కురవడం, మంచు కరగడం తదితర కారణాల వల్ల భాక్రా డ్యామ్‌లోకి నీరు ఎక్కువగా చేరిందని భాక్రా బియాన్ మేనేజ్‌మెంట్ బోర్డు అధ్యక్షులు ఏబీ అగర్వాల్ ప్రకటించారు.