భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర గంగ
అసొం: గత పదిరోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అసొంలో జనజీవనం స్తంభించింది. గంగ, బ్రహ్మపుత్రనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 12 జిల్లాల్లోని 500 గ్రామాలు నీటమునిగాయి. విద్యుత్తు, రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మృతుల సంఖ్య 141కి చేరింది. 1500 మంది సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. దాదాపు 1700 హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మధ్య ప్రదేశ్‌లో భారీ వర్షాలకు అరుగురు మృతిచెందగా, 12 మంది గల్లంతయ్యారు. రైలు పట్టాలపైకి నీరుచేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయ మేర్పడుతోంది. దీంతో రాజ్‌కోట్-ముంబయి రైలును అధికారులు నిలిపివేశారు.