పోలవరం మండలంలో స్తంభించిన జనజీవనం

పోలవరం: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని 25 గ్రామాలకు గత ఆరు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న సాయంత్రానికి తగ్గుముఖం పట్టిన వరద మళ్లీ ఈరోజు ఉదయం పెరగడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. పోలవరంలోని కడెమ్మ అవుట్‌పాల్‌ స్లూయిన్‌ వద్ద వరద నీరు 5.78 మీటర్లకు చేరింది.