ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న :కలెక్టర్
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్త సూచించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సెక్టోరియల్ అధికారులను ఆదేశించారు.