మెడికల్‌ కాలేజీలపై ఐటీ దాడులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మెడికల్‌ కాలేజీలపై మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఇవాళ అధికారులు ఐదు కాలేజీల్లో సోదాలు నిర్వహించారు. కాలేజీల నుంచి దస్త్రాలను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వివరాలు ఇప్పుడే చెప్పలేమని అధికారి తెలిపారు.