పార్లమెంట్ సమావేశాల్లోపే తెలంగాణపై నిర్ణయం
అధిష్టాన నిర్ణయానికి అందరూ కట్టుబడాలి
కోర్ కమిటీ నిర్ణయమే ఫైనల్ : దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ, జూలై 25 (జనంసాక్షి) :
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోపే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. గురువారం రాత్రి ఈమేరకు ఆయన మీడియాకు ఓ నోట్ విడుదల చేశారు. సాధ్యమైనంత త్వరలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణపై అంతిమ నిర్ణయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదేనని తెలిపారు. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడాలని సూచించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆగస్టు ఐదున ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలోపే తెలంగాణపై కీలక నిర్ణయాన్ని పార్టీ తీసుకుంటుందని తెలిపారు.