నగదు పంచుతూ దొరికిన టీడీపీ కార్యకర్తలు
గుంటూరు,(జనంసాక్షి): పంచాయతీ ఎన్నికల సందర్భంగా తాడేపల్లి మండలం చెర్రావూరులో నగదు పంచుతున్న ఇద్దరు తెలుగుదేశం కారకర్తలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.60 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.