అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించనున్న గత అధికార పార్టీ
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ గత అధికార పార్టీ తాజా అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించనుంది. ప్రచారానికి ఎన్నికల సంఘం తగినంత సమయం ఇవ్వలేదని ఈ నిర్ణయం తీసుకొంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కి చెందిన రజారబ్బాని శుక్రవారం ఈ నిర్ణయం వెలువరించారు. వాస్తవానికి పాకిస్థాన్ ఎన్నికలు ఆగస్టు 6న జరగాల్సి ఉంది. అయితే రంజాన్ నెల కావడంతో అధకార పార్టీ నేతలు సౌదీ అరేబియా వెళ్లనున్నారు. ఎన్నికలను వారం ముందు జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.