త్రిమూర్తులతో ముగిసిన వార్‌రూమ్ భేటీలు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్ వార్‌రూమ్‌లో త్రిమూర్తులతో దిగ్విజయ్‌సింగ్, ఆజాద్ వరుస భేటీలు ముగిశాయి. సీఎం,డిప్యూటీ సీఎం, బొత్సలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ఈ ముగ్గురితో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణ అంశంపై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. సీఎంతో 45 నిమిషాలు బొత్సతో 30 నిమిషాలు, దామోదర రాజనర్సింహతో 2 గంటల పాటు సదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదప్పదని సీఎం, బొత్సకు దిగ్విజయ్ సూచనప్రాయంగా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎలాంటి పరిస్థిలనైనా ఎదుర్కొవాలని వారిని ఆదేశించినట్లు సమాచారం.