సస్పెన్షన్‌ పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న ఐఏఎస్‌ అధికారి

గ్రేటర్‌ నోయిడా: ఉత్తరప్రదేశ్‌లో మహిళ ఐఏఎస్‌ అధికారి దుర్గా శక్తి నాగ్‌పాల్‌ సస్పెన్షన్‌ వివాదాస్పదమైంది. ఆమెను బలిపశువును  చేస్తున్నారంటూ ఐఏఎస్‌ అధికారుల సంఘం నిరసన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయాన్ని పున:సమీక్షిస్తామని యూపీ చీఫ్‌ సెక్రెటరీ తెలిపారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న ఒక ప్రార్థనాలయాన్ని కూల్చివేయమని అదేశాలిచ్చినందుకు అమెను సస్పెండ్‌ చేసింది. ప్రభుత్వం. 2009 బ్యాచ్‌కి చెందిన ఈ ఐఏఎస్‌ అధికారి అర్నెల్ల క్రితమే యూపీలో పోస్టింగ్‌ పొందారు. ఇసుక మాఫియా మీద దాడులతో వార్తల్లోకొచ్చిన ఆమెని ప్రభుత్వం కావాలనే శిక్షిస్తోందని రాజకీయ పార్టీ , ఐఏఎస్‌ అధికారుల సంఘం పేర్కొంటున్నాయి.