ఆందోళనలతో రాజీవ్‌గాంధీ విగ్రహం ధ్వంసం చేయడం విచారకరం: దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గేదిలేదని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. సీమాంధ్ర మంత్రుల రాజీనామాలపై ఆయన స్పందించారు. ఆందోళనలు రాజీనామాలు సర్వసాధారణమే అన్నారు. ఆందోళనలలో రాజీవ్‌గాంధీ విగ్రహాలు ధ్వంసం చేయడం విచారకరమన్నారు. అందరి ఆందోళనలకు పరిస్కారం చూపిస్తామన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ప్రజలు సమన్వయం పాటించాలని దిగ్విజయ్‌సింగ్‌ కోరారు. కోస్తాతీర ప్రాంతం , మంచి వనరులున్న ఆంధ్రప్రదేశ్‌కి మంచి భవిష్యత్తు ఉంటుదన్నారు.