గాలి జనార్ధన్‌రెడ్డి బెంగళూరు తరలింపు
హైదరాబాద్,(జనంసాక్షి): ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డిని బెంగళూరు తరలించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయనను ప్రత్యేక భద్రత ఏర్పాట్ల మధ్య బెంగళూరు తీసుకొళ్లారు. కర్ణాటకలో నమోదైన కేసులో ఆయనను కోర్టులో హాజరు పరచాల్సిందిగా బెంగళూరు కోర్టు పీటీ వారెంట్ పిజనర్ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు ఆయనను బెంగళూరు తీసుకెళ్లారు.